బాలకృష్ణ సినిమా కోసం విలన్ గా మారనున్న హీరో శ్రీకాంత్
- July 02, 2017
హీరోగా ఫెడ్ అవుట్ అయి మార్కెట్ కోల్పోయిన వారు విలన్ గా కెరీర్ ను టర్న్ తీసుకొని మళ్ళీ ఫామ్ లోకి వస్తున్నారు.. ఇప్పటికే జగపతి బాబు హీరో నుంచి విలన్ గా మారి.. ప్రస్తుతం ఓ రేంజ్ లో ఫామ్ లో కొనసాగుతున్నాడు.. ఇప్పుడు తాజాగా మరో హీరో శ్రీకాంత్ కూడా జగపతి బాబు బాటలోనే నడవనున్నట్లు తెలుస్తోంది.. అంతేకాదు.. విలన్ గా జగపతి బాబు కెరీర్ కు బూస్ట్ ఇచ్చిన బాలయ్య సినిమాతోనే శ్రీకాంత్ విలన్ గా చేస్తున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే...
బాలకృష్ణ 101 మూవీ పూరీ జగన్నాథ్ తో పైసా వసూల్ చేస్తున్నాడు.. ఈ సినిమా తర్వాత 102 సినిమాగా కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.. ఈ సినిమాలో బాలయ్య సరసన మరోసారి నయనతార జోడీ కట్టనున్నదనే టాక్.. కాగా ఈ సినిమాలో విలన్ పాత్ర అతి కీలకం కనుక ఈ పాత్రలో నటించడానికి హీరో శ్రీకాంత్ ను తీసుకొనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీకాంత్ కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించాడు.. ఈ సారి ఏకంగా బాలయ్యతోనే పోటీకి సై అంటున్నాడు.. మరి జగపతి బాబు లాగే శ్రీకాంత్ కెరీర్ కూడా విలన్ గా ఫుల్ స్వింగ్ లోకి వస్తుందేమో చూడాలి మరి..
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







