ఇకామా లేదా రీ-ఎంట్రీ వీసా: డిపెండెంట్ ఫీజు చెల్లించాల్సిందే
- July 03, 2017
రియాద్: జనరల్ డైరెక్టర్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, విదేశీ వర్కర్స్ తాలూకు డిపెండెంట్స్‌కి సంబంధించి ఫీజుని ముందస్తుగా చెల్లిస్తేనే రెసిడెన్స్ పర్మిట్స్ రెన్యువల్ జరుగుతుందని పేర్కొంది. ఈ ఫీజుల్ని స్వీకరించేందుకుగాను గవర్నమెంట్ ఏజెన్సీలు (బ్యాంకులతో సహా) తమ టెక్నికల్ ప్లాట్‌ఫామ్‌ని అప్‌డేట్ చేసుకోవాలని సూచించడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై వస్తున్న ప్రశ్నలకు స్పందిస్తూ, మినిస్ట్రీ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్ ఈ వివరాల్ని వెల్లడించింది. 2016 డిసెంబర్‌లో సౌదీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా కొన్ని నిర్ణయాల్ని పాస్ చేసింది. ఈ కొత్త విధానం ద్వారా ప్రభుత్వ ఖజానాకి అదనంగా ఆదాయం వచ్చి చేరుతుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







