అమెరికా న్యూజెర్సీలో మరో 'షిరిడీ'
- July 03, 2017
షిరిడీలో సాయిబాబా మహా సంస్థానం మాదిరి ఆలయం అమెరికాలోని న్యూజెర్సీలోనూ ఏర్పాటు కానుంది. విజయవాడలోని స్టెల్లా కళాశాల వద్ద సాయిబాబా ఆలయంలో ప్రధానార్చకుడిగా పనిచేసిన గుంటూరు జిల్లాకు చెందిన శంకరమంచి రవిశర్మ.. ఆయన కొంతకాలం క్రితం అమెరికాకు వెళ్లారు. న్యూజెర్సీలోని సాయిబాబా ఆలయంలో పనిచేసిన రవిశర్మ అక్కడ షిరిడీలోని బాబా ఆలయాన్ని పోలిన ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. ఇందుకోసం 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. షిరిడీలో ఉన్నట్టుగా ఆలయాన్ని, గోశాలను, చావడి, ద్వారకామాయి, కల్యాణ మండపం, శివాలయం, గురుకుల వేదశాలను నిర్మించడానికి రూ.100కోట్లు వ్యయమవుతుంది. దీన్ని ఒక్కో భక్తుడి నుంచి రూ.713.99ల చొప్పున (11 డాలర్లు) చొప్పున 1,111,111మంది భక్తుల ఇళ్లలో సాయిబాబా పాదుకలతో పూజ నిర్వహించి అవసరమైన విరాళాన్ని సేకరించారు. విజయదశమి రోజున భూమి పూజ చేయాలని నిర్ణయించామని తెలిపారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







