వృద్ధులకు, వికలాంగులకోసం న్యూ సర్వీస్‌

- July 05, 2017 , by Maagulf
వృద్ధులకు, వికలాంగులకోసం న్యూ సర్వీస్‌

దుబాయ్‌: వృద్ధులు, అలాగే వికలాంగుల కోసం దుబాయ్‌ పోలీసులు కొత్త సర్వీస్‌ని అందుబాటులోకి తెచ్చారు. పోలీస్‌ స్టేషన్లకు వచ్చే శ్రమ లేకుండా పలు సర్వీసులను వృద్ధులు, వికలాంగులకు వారి ఇంటివద్దనే అందించేందుకోసం ఈ కొత్త విధానాన్ని ప్రవేవపెట్టినట్లు అల్‌ రసిదియా పోలీస్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ సయీద్‌ హమాద్‌ బిన్‌ సులైమాన్‌ చెప్పారు. ప్రస్తుతానికి ఈ సర్వీసు రషిదియా ప్రాంతానికి మాత్రమే పరిమితం చేశారు. 901 నంబర్‌కి ఫోన్‌ చేసి, తమకు కావాల్సిన సర్వీసులను పొందవచ్చునని అధికారులు తెలిపారు. ఇప్పటికే చేపట్టిన ఈ సర్వీసు ద్వారా 110 మంది లబ్ది పొందినట్లు అధికారులు వివరించారు. దుబాయ్‌ని మరింతగా సిటిజన్‌ ఫ్రెండ్లీ సిటీగా మార్చేందుకోసం ఈ తరహా కొత్త విధానాల్ని అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com