74 గ్యాస్ సిలిండర్ల దొంగతనం కేసులో ప్రమేయం ఉన్న ప్రేమజంట అరెస్టు
- July 05, 2017
" ప్రేమ గుడ్డిది అని అంటారు ....మరి కొందరి విషయంలో అది దొంగది కూడా " కేవలం కొన్ని వారాల వ్యవధిలో ఈ ప్రేమజంట 74 సిలిండర్లను దొంగిలించిన నేపథ్యంలో, దక్షిణ గవర్నెట్ పోలీసులు దర్యాప్తు అనంతరం ఆ ఇరువురిని అరెస్టు చేశారు. స్థానిక నివాసితుల నుండి పలు ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత పోలీసులు ఆయా చోరీలపై సమగ్ర పరిశోధన జరిపి సిలిండర్ దొంగలను సమర్ధవంతంగా పట్టుకొన్నారు. 35 ఏళ్ల మహిళకు రహస్య స్నేహితుడిగా వ్యవహరిస్తున్న మరో 25 ఏళ్ల యువకుడిని పోలీస్ అధికారులు అరెస్టు చేశారు." ప్రత్యక్ష సాక్షుల కధనం మేరకు ఈ జంట ఒక బంగారు రంగులో ఉన్న కారులో వచ్చి సిలిండర్లను అపహరిస్తున్నట్లు గమనించామని పోలీసులకు తెలిపారు. దక్షిణ పోలీస్ డైరెక్టరేట్ సెర్చ్ అండ్ ఇన్వెస్టిమెంట్ డివిజన్ ముఖ్యాధికారి కెప్టెన్ హమీద్ అబ్దుల్ లతీఫ్ అబ్దుల్రహ్మాన్ మాట్లాడుతూ, మొదటిగా సిలిండర్లు ఎక్కడ ఉన్నాయో ఆ మహిళ కారులో ప్రయాణిస్తూ పసిగడుతుందని, గ్యాస్ సిలిండరే ఆమె ఏకైక లక్ష్యమని....తర్వాత తన బాయ్ ఫ్రెండ్ తో వచ్చి అవి తమ సొంత సొత్తు మాదిరిగా దర్జాగా కారులో ఎత్తుకెళ్లిపోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించిన నేర దృశ్యాలు ప్రత్యక్ష సాక్షి నుండి సేకరించామని అదేవిధంగా నిఘా కెమెరాలో( సీసీ టీవీలో) వారి దొంగతనాల తీరును దృశ్య సమాచార ఫుటేజ్ లో వివరంగా నమోదు కాబడింది. అనుమానిత వాహనం యొక్క లైసెన్స్ ప్లేట్ ను ఆయా వీడియోలలోగుర్తించడం జరిగింది. ఆ కారు, ట్రాఫిక్ డైరెక్టరేట్ పరిశోధన ప్రకారం, హమాద్ టౌన్ నివాసి అయిన ఒక స్త్రీకి చెందిన వాహనంగా వెల్లడి కాబడిందని ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ అల్ మన ప్రచురణలో పేర్కొంది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









