ట్రక్ ప్రమాదంలో గుర్రపు బండి ధ్వంసం

- July 05, 2017 , by Maagulf
ట్రక్ ప్రమాదంలో గుర్రపు బండి ధ్వంసం

అసలే...అవి  చల్ ..చల్  చలాకీ గుర్రాలు ....జట్కా తో సహా వాటిని ట్రక్కు లోపలకు ఎక్కించారు... కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ గుర్రాలకు ఉషారు వచ్చింది.. ట్రక్కు లోపల పరుగులు పెట్టేందుకు బలంగా ప్రయత్నించాయి...దీంతో ఒక్కసారిగా ట్రక్కు ఒడిదుడుకులకు లోనయ్యింది. ఈ ఆకస్మిక పరిణామానికి ట్రక్కు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. నడి రోడ్డుపై ట్రక్కు బోల్తాపడింది..గుర్రపు బండి నుజ్జు నుజ్జు కాబడింది. ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం 5:15 గంటలకు    సల్మాబాద్ నుంచి మనామకు వెళ్లే దారిలో సీఫ్ బ్రిడ్జి సమీపంలో జరిగింది. " ఈ ట్రక్కు లోపల  రెండు గుర్రాలు ఉన్నాయి..అవి గుర్రపు బండికి జత చేయబడి ఉన్నాయి. ట్రక్కు లోపల గడిబిడి చేసిన గుర్రాల  కారణంగా ట్రక్కుఅదుపు కోల్పోయి బోల్తా కొట్టిందని..ఆ ఘటనలో గుర్రపు బండి పాడైందని " ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com