అర టన్ను హషిష్ స్వాధీనం 17 మంది స్మగ్లర్లు అరెస్టు
- July 06, 2017
సౌదీ అరేబియాలోని అల్-అహ్సా విమానాశ్రయం వద్ద కస్టమ్స్ అధికారులు ఒక ప్రయాణికుడి సామానులో రహస్యంగా దాచిపెట్టిన 110,000 క్యాప్కాన్ మాత్రలను సౌదీ అరేబియా దేశంలోకి అక్రమ రవాణా చేసేందుకు ఆ ప్రయాణికుడు ప్రయత్నించారు. ప్రయాణీకుల సామాగ్రి తనిఖీ చేసే సమయంలో, కస్టమ్స్ అధికారులు బాక్టీల లోపల దాగివున్న క్యాప్కాన్ మాత్రలను కనుగొన్నారు. ఒక చెక్క బల్ల లోపల రహస్యంగా దాచి ప్రదేశాల్లో ఉంచి ఎవరికి కనబడకుండా జాగ్రత్తగా ఉంచారని అల్-అహ్స అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ ఒహ్మాన్ అల్-గంది చెప్పారు. గత రెండు వారాలలో సౌదీ కస్టమ్స్ అధికారులు అర టన్ను హషిష్ అక్రమ రవాణాని సమర్ధవంతంగా నిరోధించగలిగారు, అలాగే పలు అక్రమ కార్యకలాపాలలో ముఖ్య పాత్ర పోషిస్తున్న17 మంది అక్రమ రవాణాదారులను అరెస్టు చేశారు. సౌదీ కస్టమ్స్ అధికారుల చర్యతో దక్షిణ సౌదీ అరేబియాలో అనేక మంది అక్రమ రవాణాదారులు తమ ప్రణాళికలను అమలు చేయలేకపోయారు. బోర్డర్ గార్డ్స్ యొక్క అధికార ప్రతినిధి బిన్ మొహమ్మద్ అల్-హర్బి ఈ సందర్భంగా మాట్లాడుతూ, జమాన్ మరియు నజ్రాన్ సరిహద్దుల ద్వారా సౌదీ అరేబియాకు మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్నఅనేక మందిని అరెస్టు చేయబడ్డారని పేర్కొన్నారు, అల్-హర్బి అధికారులు 11 మంది ఇథియోపియన్లు, ఇద్దరు సోమాలియా వ్యక్తులు,ఇరువురు సౌదీలు మరియు ఒక యెమెన్ వ్యక్తి అక్రమ రవాణాకు సంబంధించిన ఆరోపణలపై అరెస్టు చేశారు, వీరి వద్ద నుంచి మొత్తం 544 కిలోల మాదకద్రవ్యాలను కనుగొన్నారు. ఈ అనుమానితులను సంబంధిత అధికారులకు బదిలీ చేయబడ్డారు, అనంతరం వారికి వ్యతిరేకంగా చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతాయిని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







