మధ్యాహ్న పని నిషేధం ఇప్పటికీ అమలులోనే ఉంది
- July 06, 2017
కువైట్: మండు వేసవి మధ్యాహ్నం సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఆరు బయిట ప్రాంతాల్లో కార్మికులతో పని చేయించడం నిషేధించాలనే నిర్ణయం ఇప్పటికీ అమలు చేయబడుతుందని, పబ్లిక్ అథారిటీ ఆఫ్ మాన్ పవర్ యొక్క డిప్యూటీ డైరెక్టర్ మేనేజర్ అబ్దుల్లా అల్ ముతౌతా బుధవారం చెప్పారు. జూన్ 1 వ తేదీ నుండి అమలులో ఉన్న ఈ నిర్ణయం కొనసాగింపబడుతుందని అన్నారు. అగ్నిగుండం మాదిరిగా ఉన్న సూర్యుని దహన వేడి కింద పనులు చేస్తున్న కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం అమలు చేయడానికి అధికారంను ఇందుకై ఉపయోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. 56 పని ప్రదేశాలలో 132 మంది కార్మికులు మధ్యాహ్న పని నిషేధం ఉల్లంఘించినట్లు అబ్దుల్లా అల్ ముతౌతా చెప్పారు. 83 మందితో కూడిన 35 పని స్థలాలలో మాత్రమే తమ నిర్ణయం అమలవుతున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







