వేశ్యతో ప్రేమలో.. కదిలించే ప్రేమకథ..
- July 06, 2017
క్షణ కాల సుఖం కోసం వేశ్యావాటికలోకి అడుగుపెట్టిన ఓ యువకుడిని ఓ వేశ్య అమితంగా కదిలించింది. ఇలాంటి అమ్మాయితో క్షణాల సుఖాన్ని కోరుకునే కన్నా.. జీవితాంతం తనకు తోడుగా మలుచుకోవాలని భావించాడు. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడి.. ఆపై ఆమెనూ ఒప్పించి.. ఇప్పుడు పెళ్లికి సిద్దమవుతున్నాడు.
అచ్చు సినిమా కథను తలపిస్తున్న ఈ ఘటన రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలో డ్రైవరుగా పనిచేస్తున్న 28ఏళ్ల యువకుడు ఇటీవల జీబీరోడ్డులో ఉన్న ఓ వేశ్యావాటికకు వెళ్లాడు. 27 ఏళ్ల వ్యభిచారిణితో పడక సుఖం కోసం గదిలోకి అడుగుపెట్టాడు. కానీ ఆమెను చూశాక అతని మనసు మారిపోయింది.
కొన్నాళ్లు విటుడిగానే ఆ వేశ్యాగృహానికి వెళ్లిన యువకుడు.. ఆ తర్వాత తన మనసులోని మాటను బయటపెట్టేశాడు. ఇందుకు యువతి కూడా అంగీకారం తెలపడంతో.. ఢిల్లీ మహిళా కమిషన్ అధికారులను కలిసి ఆమెకు వేశ్యాగృహం నుంచి విముక్తి కల్పించాలని కోరాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను బయటకు తీసుకొచ్చారు.
యువకుడి నిర్ణయానికి అతని తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో.. త్వరలోనే అతను ఆ యువతిని పెళ్లాడబోతున్నాడు. వేశ్యాగృహంలో ప్రేమలో పడ్డ అతని కథ ఇప్పుడు ఢిల్లీలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటారని ఢిల్లీ మహిళా కమిషన్ అధికారులు చెబుతున్నారు.
కాగా, వేశ్యాగృహంలో మగ్గిపోయిన ఆ యువతి నేపాల్ నుంచి బతుకుదెరువు కోసం ఇండియాకు వలస వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఢిల్లీకి చేరుకోగా.. జీబీ రోడ్డులోని వేశ్యాగృహంలో అనూహ్యంగా చిక్కుకుపోయింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







