అక్రమ ఇమ్మిగ్రేషన్‌ని అడ్డుకున్న అబుదాబీ కస్టమ్స్‌

- July 07, 2017 , by Maagulf
అక్రమ ఇమ్మిగ్రేషన్‌ని అడ్డుకున్న అబుదాబీ కస్టమ్స్‌

అబుదాబీ జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ కస్టమ్స్‌, అక్రమ మైగ్రేషన్‌ యత్నాన్ని అడ్డుకుంది. అరబ్‌ రీజియన్‌కి చెందిన ముగ్గురు వ్యక్తులు ఓ వాహనం ద్వారా అక్రమ ఇమ్మిగ్రేషన్‌కి పాల్పడేందుకు యత్నించగా, అధికారులు చాకచక్యంగా ఈ యత్నాన్ని పసిగట్టారు. ఓ వాహనంలో వీరు దాక్కోగా, ట్రక్‌ డ్రైవర్‌పై అనుమానం వచ్చిన వెంటనే అధికారులు ఆ వాహనాన్ని తనిఖీ చేసి, అందులో ఉన్నవారిని పట్టుకున్నారు. అబుదాబీ జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ కస్టమ్స్‌ యాక్టింగ్‌ డైరెక్టర్‌ జనరల్‌ మొహమ్మద్‌ ఖదీమ్‌ అల్‌ హమెలి, కస్టమ్స్‌ అధికారులను ఈ సందర్భంగా ప్రశంసించారు. నిందితుల్ని తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com