ముహర్రాక్‌ రింగ్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ని సందర్శించిన మినిస్టర్‌

- July 07, 2017 , by Maagulf
ముహర్రాక్‌ రింగ్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ని సందర్శించిన మినిస్టర్‌

మనామా: మినిస్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌, మునిసిపాలిటీస్‌ ఎఫైర్స్‌ అండ్‌ అర్బన్‌ ప్లానింగ్‌ ఇస్సామ్‌ ఖలాఫ్‌ - ముహర్రాక్‌ రింగ్‌రోడ్‌ ప్రాజెక్ట్‌ని సందర్శించారు. హిద్‌ ఇంటర్‌ఛేంజ్‌ మరియు అవాజ్‌, గలాలి మధ్య గల ప్రాంతాన్ని ఆయన సందర్శించడం జరిగింది. ప్రస్తుత విస్తరణ ఫేజ్‌ 3 కిలోమీటర్ల పొడవైనది. 2017 ఫిబ్రవరిలో ఇది ప్రారంభమై, అక్టోబర్‌ వరకు కొనసాగుతుంది. హిద్‌, దైర్‌, సమాహీజ్‌, గలాలి మరియు అమ్వాజ్‌లోని హౌసింగ్‌ ప్రాజెక్ట్స్‌, దిల్‌మునియా మరియు దియ్యార్‌ అల్‌ ముహరాక్‌ ప్రాంతాలకు ఈ ప్రాజెక్ట్‌ ద్వారా యాక్సెస్‌ తేలికగా లభిస్తుంది. అమాజ్‌ ఎంట్రన్స్‌ నుంచి హిద్‌ వరకు రెండు లేన్లుగా ఉన్న రోడు, రెండు డైరెక్షన్లలో మూడు లేన్లకు విస్తరిస్తున్నారు. అలాగే మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలూ చేపడుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com