ఎంపీల చే రాష్ట్రపతికి జులై 23న ఘనమైన వీడ్కోలు
- July 07, 2017
రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న ప్రణబ్ ముఖర్జీకి పార్లమెంట్ ఉభయసభలు ఘన వీడ్కోలు పలకనున్నాయి. జులై 23న పార్లమెంట్ సభ్యులు రాష్ట్రపతికి వీడ్కోలు ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
2012 జులై 25న భారత 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ప్రణబ్ ముఖర్జీ.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాలతో కలిసి పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రణబ్.. గతంలో విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఆర్థిక మంత్రిగా పనిచేశారు. జులై 24న రాష్ట్రపతిగా ఆయన పదవీకాలం పూర్తవనుంది. ఈ నేపథ్యంలో అంతకు ఒకరోజు ముందుగా జులై 23న రాష్ట్రపతికి వీడ్కోలు ఇవ్వనున్నారు.
రాష్ట్రపతి పదవీకాలం పూర్తవడంతో తదుపరి రాష్ట్రపతి ఎంపిక కోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఖరారు చేసింది. కాగా.. రాష్ట్రపతి ఎన్నికకు అధికార పక్షం నుంచి బిహార్ మాజీ గవర్నర్ రామ్నాథ్ కోవింద్, ప్రతిపక్షాల నుంచి లోక్సభ మాజీ స్పీకర్ మీరాకూమార్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. జులై 17న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. జులై 20న ఫలితాలు విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







