విడుదలైన 'అనగనగా ఒక వూళ్లొ' ఫస్ట్‌లుక్
- July 07, 2017
చంద్ర బాలాజీ ఫిలింస్ పతాకంపై అశోక్ కుమార్, ప్రియావర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'అనగనగా ఒక వూళ్లొ'. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ శుక్రవారం విడుదలైంది. ప్రముఖ నటుడు బెనర్జీ ఈ ఫస్ట్‌లుక్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'చిత్రంలో నేను రెగ్యులర్‌గా చేసేపాత్ర కాకుండా విభిన్న పాత్రలో నటించా. పల్లెటూరి నేపథ్యంలో సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. లవ్, ఫ్యామిలీ రిలేషన్స్, ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో దర్శకుడు తెరకెక్కించారు. సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాతలు కూడా కథకు తగ్గట్టుగా ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. టీం అంతా చక్కగా సహకరించారు' అన్నారు.
నిర్మాత చంద్రరావు మాట్లాడుతూ.. 'అంతర్వేదిలో సినిమా షూటింగ్ ప్రారంభించాం. 45 రోజుల పాటు రాజోలు పరిసర ప్రాంతాల్లో షూటింగ్చేశాం. పల్లెటూరి వాతావరణంలో జరిగే కథ ఇది. రాజమౌళి గారి లాంటిపెద్ద దర్శకుల వద్ద మా దర్శకుడు సాయికృష్ణ పని చేయడంతో తొలి సినిమా అయినా అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమా తీశారు. బెనర్జీ, సుమన్ కీలక పాత్రల్లో నటించారు.' అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక







