మళ్లీ పెరిగిన బంగారం ధర!

- July 07, 2017 , by Maagulf
మళ్లీ పెరిగిన బంగారం ధర!

న్యూదిల్లీ: వరుసగా నాలుగురోజుల పాటు పడిపోతూ వస్తున్న బంగారం ధర శుక్రవారం తిరిగి పుంజుకుంది. 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.220 పెరిగి రూ.29,150కి చేరింది. ఓవర్సీస్లో పసిడి కొనుగోళ్లు స్తబ్దుగా ఉన్నా, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ ఉండటంతో పసిడి ధర పెరిగిందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క అమ్మకాల ఒత్తిడితో వెండి ధర రూ.300 తగ్గి కిలో రూ.38,200లకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధర 0.33శాతం తగ్గి, ఔన్సు 1,221 డాలర్లు పలికింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com