భారీ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
- July 08, 2017
హైదరాబాద్‌లో మరో భారీ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. నిందితుల నుంచి భారీగా డ్రగ్స్ ప్యాకెట్లు, 20 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బంజారాహిల్స్ ప్రాంతంలో మత్తుమందు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు ఆఫ్రికన్ దేశస్తుడు కాగా.. మరో ఇద్దరు స్థానికులు. డ్రగ్స్ కేసులోఇప్పటికే అరెస్టైన ముఠాతో వీరికి సంబంధాలు లేవని సమచారం. ప్రధాన నిందితుడు నైజీరియన్ బెర్నార్డ్ విల్సన్‌పై గతంలోనూ డ్రగ్స్ కేసు నమోదైంది. డిమాండ్ పెరుగుతున్న కొద్ది డ్రగ్స్ రేటు పెంచుతుంటారని పోలీసులు తెలిపారు. నిందితులు స్టార్ హోటళ్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ హరికిషన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







