హీరో బాలయ్య తమిళ డైలాగులు అదిరాయ్

- July 10, 2017 , by Maagulf
హీరో బాలయ్య తమిళ డైలాగులు అదిరాయ్

క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా భారీ విజయం అందుకుంది. ఈ సినిమా అదే పేరుతో ఇప్పుడు తమిళంలోకి వెళుతుంది. తాజాగా ఈ సినిమా తమిళ ఆడియో ఆవిస్కారణ జరిగింది. ఈ వేడుకలో మాట్లాడిన బాలయ్య .. "గౌతమిపుత్ర శాతకర్ణి' ఓ ప్రాంతీయ చిత్రం కాదు. ప్రతి భారతీయుడూ చూడదగ్గ ఓ వీరుడి కథ. ఈ సినిమాను తమిళంలో మాత్రమే కాదు.. దేశంలోని అన్ని భాషల్లోనూ అనువాదం చేస్తాం" అన్నారు.
ఇంకా చెబుతూ.. తానూ తమిళబిడ్డనే అన్నారు. ఎంజీఆర్‌ నాకు పెదనాన్న. శివాజీ చిన్నాన్న. వీరందరి మధ్యే నేను పెరిగా. ఇక్కడికి, అక్కడికి పెద్ద తేడా ఏం లేదు. 'వీరపాండి కట్టబొమ్మన్‌' మాదిరిగానే 'గౌతమీపుత్ర శాతకర్ణి'. త్వరలోనే అన్ని భాషల్లో అనువాదం చేయనున్నాం" అని చెప్పారు బాలయ్య. ఈ సందర్భంగా 'వీరపాండియ కట్టబొమ్మన్‌'లోని డైలాగును తమిళంలో చెప్పి అభిమానులను ఉర్రూతలూగించారు బాలయ్య. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com