బకాయిలకు చెక్‌: ల్యాండ్‌లైన్‌ టెలిఫోన్ల ఆటో డిస్‌కనెక్షన్‌

- July 11, 2017 , by Maagulf
బకాయిలకు చెక్‌: ల్యాండ్‌లైన్‌ టెలిఫోన్ల ఆటో డిస్‌కనెక్షన్‌

జులై 23 తర్వాత ల్యాండ్‌లైన్‌ టెలిఫోన్‌ కనెక్షన్లకు సంబంధించి బకాయిలు ఉంటే ఆటో డిస్‌కనెక్షన్‌ అయిపోతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. గత ఆదివారం బకాయిలు ఉన్నవారికి తొలి విడత నోటీసులు పంపామని, రెండో విడత నోటీసులు ఈ ఆదివారం పంపించనున్నామని అధికారులు తెలిపారు. రెండో వార్నింగ్‌ తర్వాత కూడా బకాయిలు చెల్లించనివారి కనెక్షన్లను తొలగిస్తామని వారు హెచ్చరించారు. నెలకు 50 కువైటీ దినార్స్‌ (హౌస్‌ ల్యాండ్‌లైన్స్‌), నెలకి 100 కువైటీ దినార్స్‌ (కమర్షియల్‌ ల్యాండ్‌లైన్స్‌) సబ్‌స్క్రైబర్స్‌కి ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com