భారతీయ వ్యక్తి పరిస్థితి విషమం
- July 11, 2017
మనామా: భారత జాతీయుడొకరు, హీట్ స్ట్రోక్‌తో రోడ్డు మీద పడిపోయారు. కేరళకు చెందిన మొహమ్మద్ హారిస్, హీట్ స్ట్రోక్‌తో రోడ్డు మీద పడిపోయి, కోమాలోకి వెళ్ళిపోయారు. అపార్ట్‌మెంట్లకు నీటిని డెలివరీ చేసే పనిలో మొహమ్మద్ హారిస్ పనిచేస్తున్నట్లు తేలింది. ప్రస్తుతం మొహ్మద్ సలామియా మెడికల్ కాంప్లెక్స్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. అతని భార్య ఏడు నెలల గర్భవతి కాగా, బాధితుడి తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని బషీర్ అంబల్లయ్ అనే సోషల్ వర్కర్ తెలిపారు. మొహమ్మద్ హారిస్ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్‌తో బాధపడుతున్నట్లు సలమానియా మెడికల్ కాంప్లెక్స్ ఎమర్జన్సీ సెక్షన్ చీఫ్ రెసిడెంట్ డాక్టర్ పివి చెరియన్ చెప్పారు. ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో బయట తిరగడం మంచిది కాదనీ, పనిచేసేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెరియన్ సూచించారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







