నేటి నుంచి హైదరాబాద్‌ - కొలంబో విమాన సర్వీసు

- July 11, 2017 , by Maagulf
నేటి నుంచి హైదరాబాద్‌ - కొలంబో విమాన సర్వీసు

 హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ నాన్‌ స్టాప్‌ విమాన సర్వీసును ప్రారంభించనుందని జిఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (జిహెచ్‌ఐఎఎల్‌) వెల్లడించింది. బుధవారం నుంచి హైదరాబాద్‌-కొలంబో మధ్య విమాన సర్వీసు ప్రారంభం కానుందని తెలిపింది. వారంలో నాలుగు రోజులు (సోమవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం) ఎ320 విమానం ద్వారా ఈ సర్వీసును శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ నడపనుందని పేర్కొంది. కొలంబోలో భారతీయ ప్రయాణికులు ఎలాం టి ఆటంకాలు ఎదుర్కొనకుండా ఉండేందుకు శ్రీలంక ఇ-వీసాను అందుబాటులో ఉంచిందని తెలిపింది. హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి మరో అంతర్జాతీయ సర్వీసును ప్రారంభించటం ఎంతో సంతోషాన్నిస్తోందని, ఈ కొత్త విమాన సర్వీసు ద్వారా దక్షిణ, మధ్య భారత్‌కు చెందిన ప్రయాణికులు నేరుగా శ్రీలంకకు చేరుకోవచ్చని జిహెచ్‌ఐఎఎల్‌ సిఇఒ ఎస్‌జికె కిశోర్‌ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com