నేటి నుంచి హైదరాబాద్ - కొలంబో విమాన సర్వీసు
- July 11, 2017
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు శ్రీలంక ఎయిర్‌లైన్స్ నాన్ స్టాప్ విమాన సర్వీసును ప్రారంభించనుందని జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జిహెచ్‌ఐఎఎల్) వెల్లడించింది. బుధవారం నుంచి హైదరాబాద్-కొలంబో మధ్య విమాన సర్వీసు ప్రారంభం కానుందని తెలిపింది. వారంలో నాలుగు రోజులు (సోమవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం) ఎ320 విమానం ద్వారా ఈ సర్వీసును శ్రీలంక ఎయిర్‌లైన్స్ నడపనుందని పేర్కొంది. కొలంబోలో భారతీయ ప్రయాణికులు ఎలాం టి ఆటంకాలు ఎదుర్కొనకుండా ఉండేందుకు శ్రీలంక ఇ-వీసాను అందుబాటులో ఉంచిందని తెలిపింది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి మరో అంతర్జాతీయ సర్వీసును ప్రారంభించటం ఎంతో సంతోషాన్నిస్తోందని, ఈ కొత్త విమాన సర్వీసు ద్వారా దక్షిణ, మధ్య భారత్‌కు చెందిన ప్రయాణికులు నేరుగా శ్రీలంకకు చేరుకోవచ్చని జిహెచ్‌ఐఎఎల్ సిఇఒ ఎస్‌జికె కిశోర్ తెలిపారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







