తెలంగాణ రాజధానిలో డ్రగ్స్ కేసు: ముగ్గురు హీరోలు, నిర్మాతలకు నోటీసులు
- July 12, 2017
రాజధానిలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ మాఫియా కేసులో సిట్ అధికారులు బుధవారం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పదిమందికి నోటీసులు జారీ చేశారు. ఆరోజు రోజుల్లోగా సిట్ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నోటీసులు అందుకున్నవారిలో ముగ్గురు యువ హీరోలు, నలుగురు నిర్మాతలు, ఇద్దరు దర్శకులు, ఓ ఫైట్ మాస్టర్ ఉన్నారు. విచారణకు హాజరు కాకుంటే చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. కాగా సినీ ఇండస్ట్రీతో పాటు ఎంఎన్‌సీ కంపెనీలకు డ్రగ్స్ కేసుతో సంబంధాలున్నాయన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
మరోవైపు డ్రగ్స్ రాకెట్లో పలువురు సినీ ప్రముఖుల ప్రమేయం ఉన్నట్టుగా వచ్చిన వార్తలపై తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు స్పందించారు. కొంత మంది డ్రగ్స్ వాడటం వల్ల మొత్తం ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు శివాజీ రాజాతో పాటు నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, హీరో శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







