అర టన్ను హాషిష్, 63,000 క్యాప్టగాన్ పిల్స్ స్వాధీనం
- July 12, 2017
బోర్డర్ గార్డ్స్, గత వారంలో జరిపిన తనిఖీల్లో అర టన్ను హాషిష్, 63,000 కాప్టగాన్ పిల్స్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 19 స్మగ్లర్స్ని కూడా బోర్డర్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్నారు. బోర్డర్ గార్డ్స్ అధికార ప్రతినిథి కల్నల్ సహెర్ బిన్ మొహమ్మద్ అల్ హర్బి మాట్లాడుతూ, బోర్డర్ లోంచి అక్రమంగా కింగ్డమ్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారనీ, యెమెన్ నుంచి ఎక్కువగా వారు వస్తున్నారనీ, నార్కోటిక్స్ని స్మగ్లింగ్ చేయడమే వీరి పని అని తెలిపారు. 14 మంది ఇథియోపియన్లను, 5 మంది యెమనీలను అరెస్ట్ చేశామని వివరించారు. 543,200 కిలోల హాషిష్, 63,260 నార్కోటిక్ పిల్స్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారాయన. స్మగ్లింగ్ యత్నాల్ని తిప్పి కొట్టడంలో బోర్డర్ గార్డ్స్ అత్యంత సమర్థంగా వ్యవహరిస్తున్నట్లు వివరించారు అల్ హర్బి.
తాజా వార్తలు
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?







