మామిడి కొబ్బరి చక్రాలు
- July 12, 2017
కావలసిన పదార్థాలు: కొబ్బరి మామిడి లేదా దోర బంగినపల్లి తురుము- 1 కప్పు, నానబెట్టి పొట్టు తీసిన బాదం- 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము- 1 కప్పు, బెల్లం తురుము, ఎండు కొబ్బరి తురుము- ఒక్కోటి 1 టేబుల్ స్పూను చొప్పున, బియ్యప్పిండి- 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి- 1 టీ స్పూను.
తయారీ విధానం: బాదం పప్పును మెత్తగా రుబ్బుకుని దానిలో మామిడి తురుము, పచ్చికొబ్బరి తురుము, బెల్లం, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. తరువాత దానిని ఆవిరిమీద ఒక విజిల్ వచ్చే వరకూ ఉడికించాలి. మిశ్రమం చల్లారాక మరోసారి బాగా కలిపి, దానిని బారుగా లావుపాటి కర్ర మాదిరిగా చేసుకోవాలి. తరువాత దానికి నెయ్యి రాసి ఎండు కొబ్బరిలో దొర్లించాలి. ఆ తరువాత మిశ్రమాన్ని రెండు గంటల సేపు ఫ్రిజ్‌లో ఉంచి ముక్కలు కోయాలి.
తాజా వార్తలు
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు









