కరీం నగర్ ని లండన్ చేస్తా - సీఎం కెసిఆర్ హామీ
- July 12, 2017
జనాలని ఆకర్షించడం, కేవలం మాటలతో వారిని కేరింతలు కొట్టించడం, అరచేతిలో మాటలలోనే స్వర్గం చూపించడం లో తెలంగాణా ముఖ్యమంత్రి కి తిరుగు లేదు అనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల లోనే కాదు యావత్ సౌత్ ఇండియా లోనే కెసిఆర్ ది ఆ లెక్కలో తిరుగులేని స్టైల్. ఈ మధ్య కరీం నగర్ పర్యటన చేసిన కెసిఆర్ అక్కడ బహిరంగ సభలో మాట్లాడారు.
రెండు సంవత్సరాల లో తాను హేలీకాప్టర్ లో వెళుతుంటే కరీం నగర్ ప్రాంతం మీదనుంచి వెళ్తూ ఉంటె తనకి ఒక పెద్ద అడవి కనపడాలని మూడవ విడత హరితహారం సందర్భంగా చెప్పారు కెసిఆర్.ఇదివరకు కరీం నగర్ కి వచ్చినప్పుడు ఇచ్చిన హామీనే కెసిఆర్ మళ్ళీ చెప్పుకొచ్చారు. అదేంటంటే ఇక్కడి రహదారులు అన్నీ అద్దాలు లాగా మెరిసేలా చేస్తా అనీ లండన్ స్టైల్ లో రోడ్లు వేస్తా అనీ అన్నారు కెసిఆర్. కరీంనగర్ కు లండన్ స్థాయి సొగబులు అద్దుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
లండన్ నగరానికి థేమ్స్ నది పక్కనే ఉన్నట్టుగా, కరీంనగర్ కు మానేరు ఉందన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఇటీవలే రూ. 500 కోట్లతో ఒక టూరిజం ప్రాజెక్టును కేటాయించామని సీఎం గుర్తు చేశారు. కరీంనగర్ లో రోడ్లన్నీ త్వరలోనే రూపు మారుతాయనీ, లండన్ నగరాన్ని తలపించేలా తయారు చేస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం







