తీవ్రవాద నిందితులకు ఆశ్రయం కల్పించిన వ్యక్తిపై విచారణ

- July 13, 2017 , by Maagulf
తీవ్రవాద నిందితులకు ఆశ్రయం కల్పించిన వ్యక్తిపై  విచారణ

మనామా: తీవ్రవాద నేరాలకు పాల్పడిన ఇరువురు నిందితులకు ఆశ్రయం ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తిపై నమోదైన కేసు విచారణను హై క్రిమినల్ కోర్ట్  బుధవారం ప్రారంభించారు, వీరిలో ఒక తీవ్రవాదికి జీవిత ఖైదు విధించబడింది. కాగా ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి తూర్పు అకేర్లోని తన ఇంట్లో ఆ తీవ్రవాద జంటను దాచిపెట్టినట్లు పోలీసులు ఒక సమాచారం అందుకున్న తరువాత ఆ ఇంటిని చుట్టుముట్టి వారిని అదుపులోనికి తీసుకొన్నారు. ఈ తనిఖీలో తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చిన 39 ఏళ్ల బహ్రెయిన్ వ్యక్తి  సహా పట్టుబడ్డాడు. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం, ప్రతివాది తీవ్రవాదులకు రవాణా సేవలను సైతం అందించి సహకరించినట్లు పేర్కొన్నారు.  ఆ ఇరువురు తీవ్రవాదులు పోలీసు అధికారులను లక్ష్యంగా చేసుకున్న తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహించటానికి దోహదపడింది. " మా ఇంటి దగ్గర నేను బైట కూర్చున్నప్పుడు ఓ కారు నా దగ్గరికి వచ్చి, మాకు వసతి కల్పించమని అడిగారు" అని ఆ వ్యక్తి న్యాయవాదులతో చెప్పాడు. "నా భార్య ఇంట్లో లేనందున, నేను అంగీకరించానని పేర్కొన్నాడు . కోర్టు రికార్డుల ప్రకారం, జీవిత ఖైదు  విధించబడిన తీవ్రవాదులతో ఒకరిని  "బాక్టీరియా" అని మారుపేరుతో  పిలుస్తారు. 39 ఏళ్ల బహ్రెయిన్ వ్యక్తి   కేసును అక్టోబర్ 5 వ తేదీన విచారణ కోసం వాయిదా వేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com