దర్శకుడు వెంకట్‌ప్రభు పార్టీ మొదలైంది

- July 13, 2017 , by Maagulf
దర్శకుడు వెంకట్‌ప్రభు పార్టీ మొదలైంది

కొందరు దర్శకుల చిత్రాలకే ప్రత్యేక బ్రాండ్‌ ఉంటుంది. అలాంటి వారిలో దర్శకుడు వెంకట్‌ప్రభు ఒకరు. ఆయన చిత్రాల్లో చాలా మంది హీరోలుంటారు. అయినా అవి వెంకట్‌ప్రభు చిత్రాలుగానే గుర్తింపబడతాయి. చెన్నై 28 రెండు భాగాలు, సరోజ, గోవా లాంటివన్నీ ఆ తరహా చిత్రాలే. తాజాగా వెంకట్‌ప్రభు పార్టీకి రెడీ అయ్యారు. అవును ఆయన తాజా చిత్రం పేరు పార్టీ.

ఇంతకు ముందు వెంకట్‌ప్రభు దర్శకత్వంలో  అమ్మా క్రియేషన్స్‌ పతాకంపై సరోజా వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన టి.శివ మళ్లీ ఆయన దర్శకత్వంలోనే చేస్తున్న చిత్రం పార్టీ. వెంకట్‌ప్రభు గత చిత్రాల తరహాలోనే ఇందులోనూ ఒక నక్షత్ర బృందమే నటిస్తున్నారు. నటుడు సత్యరాజ్, జయరామ్, జై, శివ, కయల్‌ చంద్రన్, రమ్యకృష్ణ, నివేదా పేతురాజ్, రెజీనా, సంచి తాశెట్టి  ప్రధాన పాత్రలు పోషించనున్న ఈ చి త్రానికి ప్రేమ్‌జీ సంగీతాన్ని అందిస్తున్నారు.

తన సోదరుడైన వెంకట్‌ప్రభు చిత్రానికి ఈయన తొలిసారిగా సంగీతాన్ని అందిస్తున్న చిత్రం ఇదే అవుతుంది. రాజేశ్‌ మాధవ్‌ ఛాయాగ్రహణం నెరుపుతున్న ఈ చిత్ర మేజర్‌ పార్టీ షూటింగ్‌ను ఫిజీ దీవుల్లో నిర్వహించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.  ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఉదయం చెన్నైలో జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com