'డ్రగ్స్' నేపథ్యంలో నయనతార కథానాయికగా 'వాసుకి'
- July 15, 2017
'డ్రగ్స్' వ్యవహారంలో టాలీవుడ్ పరేషాన్ అవుతోంది. `డ్రగ్స్` డీల్‌తో సంబంధం ఉన్న కొందరు యువహీరోలు, హీరోయిన్‌లు, దర్శకనిర్మాతలు `సిట్` ముందు విచారణకు రెడీ అవుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైమ్‌లోనే కథానాయిక భావన కిడ్నాప్, అత్యాచారం ఉదంతంలో హీరో దిలీప్ అరెస్టు మాలీవుడ్‌లో ప్రకంపనాలు రేపుతోంది. రెండు పరిశ్రమల్లో ఒకటే కల్లోలం. అయితే ఈ రెండు పరిశ్రమలతో ముడిపడి .. ఇదే తరహా ఉదంతాలతో సంబంధం ఉన్న కథాంశంతో నయనతార కథానాయిక నటించిన ఓ సినిమా ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అవ్వడం హాట్ టాపిక్ అయ్యింది.
మలయాళ బ్లాక్‌బస్టర్ `పుదియ నియమం` తెలుగులో `వాసుకి`గా రిలీజవుతోంది. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్. మోహన్ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమా కథాంశం డ్రగ్స్, అత్యాచారం బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని తెలుస్తోంది. డ్రగ్స్ బాధితులైన కొందరు యువకులు ఎలాంటి అఘాయిత్యం చేశారో తెరపై చూడాల్సిందేనని మేకర్స్ చెబుతున్నారు.
ఇకపోతే `డ్రగ్స్`కి బానిసలైన వాళ్లు ఎలా ప్రవర్తిస్తారు? అన్నది ఈ సినిమాలో అద్భుతంగా పిక్చరైజ్ చేశారు. మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాని, త్వరలోనే తెలుగులో భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







