యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్ ప్రచారకర్తగా 'సూపర్‌వుమెన్'
- July 15, 2017
యూనిసెఫ్(యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్ ఫండ్) సుహృద్భావ ప్రచార కర్తగా యూట్యూబ్ స్టార్, భారత సంతతికి చెందిన సూపర్‌వుమెన్ లిల్లీ సింగ్ నియమితులయ్యారు. శుక్రవారం ఈ విషయాన్ని యూనిసెఫ్ అధికారికంగా ప్రకటించింది. యూనిసెఫ్ నిర్వహించే 'యూత్ ఫర్ ఛేంజ్' కార్యక్రమంలో లిల్లీ భాగస్వామురాలిగా మారారు. ఆరోగ్యం, పారిశుద్ధ్యం, బాలకార్మికులు, లింగవివక్ష తదితర అంశాల గురించి యూనిసెఫ్ నిర్వహించే ప్రచార కార్యక్రమాలకు ఇక నుంచి సూపర్‌వుమెన్ ప్రాతినిథ్యం వహిస్తారు. సుహృద్భావ ప్రచార కర్తగా నియమితులైనందుకు లిల్లీ ఆనందం వ్యక్తం చేశారు. యూట్యూబ్‌లో 'సూపర్‌వుమెన్' పేరుతో ప్రత్యేక ఛానెల్ ద్వారా ఆమె చేస్తున్న వీడియోలు ఎంతో ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ ఛానెల్‌ను దాదాపు 11.9 మిలియన్ల మంది చందాదారులు ఉన్నారు. బాలల హక్కుల కోసం యూనిసెఫ్ చేపట్టే ఈ బృహత్తర కార్యక్రమానికి ఆమె ఛానెల్‌ను వేదికగా ఉపయోగించుకోనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







