వింబుల్డన్‌ ఫైనల్లో ఫెడరర్, సిలిచ్

- July 16, 2017 , by Maagulf
వింబుల్డన్‌ ఫైనల్లో ఫెడరర్, సిలిచ్

టెన్నిస్‌ యోధుడు, గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల వేటగాడు రోజర్‌ ఫెడరర్‌ రికార్డు స్థాయిలో 11వ సారి వింబుల్డన్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు. చెక్‌ రిపబ్లిక్‌ ఆటగాడు థామస్‌ బెర్డిచ్‌పై 7-6(7-4), 7-6(7-4), 6-4తో ఫెడరర్‌ వరుస సెట్లలో గెలుపొందాడు. పట్టువదలని విక్రమార్కుని వలె క్రోయేషియా టెన్నిస్‌ ఆటగాడు మారిన్‌ సిలిచ్‌.. ఎట్టకేలకు వింబుల్డన్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. గతంలో 11 సార్లు పచ్చిక గ్రాండ్‌స్లామ్‌లో గట్టి ప్రయత్నాలే చేసినా.. పుష్కర ప్రయత్నంలో గానీ సిలిచ్‌ స్వప్నం సాకారం కాలేదు. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో అమెరికా సంచలనం శామ్‌ ఖుర్రేతో హోరాహోరీ పోరులో పైచేయి సాధించిన సిలిచ్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. నాల్గు సెట్ల పోరులో 6-7(6-8), 6-4, 7-6(7-3), 7-5తో ఖుర్రేపై సిలిచ్‌ గెలుపొందాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ బోపన్న, డాబ్రోస్కీ జంట క్వార్టర్‌ఫైనల్లో 7-6(7-4), 4-6, 5-7తో వాట్సన్‌, కొంటినెన్‌ల చేతిలో ఓటమిపా లయ్యారు. ఇప్పటికే లియాండర్‌ పేస్‌, సానియా మీర్జాలు నిష్క్రమించగా.. తాజాగా రోహన్‌ బోపన్న ఓటమితో వింబుల్డన్‌లో భారత టైటిల్‌ వేట క్వార్టర్స్‌లోనే ముగిసినట్లైంది. 

సూపర్‌ ఫెడరర్‌ : బెర్డిచ్‌తో సెమీస్‌లో ఫెడరర్‌ గట్టిగా పోరాడాడు. తొలి రెండు సెట్లు టైబ్రేకర్‌కు దారితీశాయి. రోజర్‌తో హోరాహోరీ గా పోరాడిన బెర్డిచ్‌ అంత సులువుగా పాయింట్లు ఇచ్చుకోలేదు. 7-6(7-4), 7-6(7-4), 6-4తో 138 నిమిషాల్లో సమరంలో ఫెడరర్‌ పైచేయి సాధించాడు. 13 ఏస్‌లు, 51 విన్నర్లతో మెరిసిన ఫెడరర్‌.. పచ్చికపై ఫామ్‌ చాటుకున్నాడు. మూడు గంటల పాటు సాగిన సెమీఫైనల్లో మారిన్‌ సిలిచ్‌కు విజయం సులభంగా రాలేదు. ఆండీ ముర్రే ఆశలకు తెరదించిన శామ్‌ ఖుర్రే.. టైబ్రేకర్‌లో తొలి సెట్‌ను నెగ్గి ఆశ్చర్యపరిచాడు. కానీ రెండో సెట్‌లో పుంజుకున్న సిలిచ్‌ 6-4తో గెలుపొంది స్కోరు సమం చేశాడు. మూడో సెట్‌ సైతం టైబ్రేకర్‌కు దారితీసినా 7-3తో పైచేయి సాధించిన సిలిచ్‌ ముందంజ వేశాడు. నాల్గో సెట్‌లో ఖుర్రే నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా.. 7-5తో ఆధిక్యం సాధించిన సిలిచ్‌ ఫైనల్లోకి చేరుకు న్నాడు. 25 ఏస్‌లతో ఖుర్రేను కంగు తినిపించిన సిలిచ్‌.. ఏకంగా 70 విన్నర్లు సాధించాడు. నెట్‌ గేమ్‌లో, బ్రేక్‌ పాయింట్ల విషయంలో ఖుర్రే మెరుగ్గానే ఆడినా... సిలిచ్‌ 150 పాయింట్లు సాధించి తేడా చూపించాడు. కానీ ఖుర్రే కేవలం121 పాయింట్లతోనే సరిపెట్టుకున్నాడు. 

వీనస్‌ సిక్సర్‌ కొట్టేనా? : మహిళల సింగిల్స్‌ ఫైనల్లో వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) రికార్డు టైటిల్‌ వేటలో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. వింబుల్డన్‌లో సుదీర్ఘ విరామం తర్వాత ఫైనల్లోకి చేరుకున్న వీనస్‌.. లేటు వయసులో పచ్చిక గ్రాండ్‌స్లామ్‌ సహా మేజర్‌ టైటిల్‌ నెగ్గిన తొలి క్రీడాకారిణిగా నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. స్పెయిన్‌ భామ గార్బెన్‌ ముగురుజతో వీనస్‌ టైటిల్‌ పోరులో ఢకొీట్టనున్నది. గ్రాస్‌ కోర్టులో మెరుగైన కదలికలతో యువ క్రీడాకారిణిలకు ముచ్చె మటలు పట్టించిన వీనస్‌ను ఎదుర్కొవటం ముగురుజకు కఠిన సవాల్‌. వీనస్‌ ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లోనూ ఫైనల్స్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com