ఆసిఫాబాద్ జిల్లా లో నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల గ్యాంగ్ గుట్టు రట్టు

- July 17, 2017 , by Maagulf
ఆసిఫాబాద్ జిల్లా లో నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల గ్యాంగ్ గుట్టు రట్టు

నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పోలీసులు. ఇటీవల ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా 13 నకిలీ ఇన్సురెన్స్ సర్టిఫికెట్లు పట్టుబడ్డాయి. పోలీసుల దర్యాప్తులో కోమటిగూడకు చెందిన తిరుపతి వీటిని తయారు చేస్తున్నట్టు తేలింది. అతను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీసాయి, లక్ష్మి సాయి ఇంటర్నెట్‌ సెంటర్లలో నకిలీ ఇన్సురెన్స్ సర్టిఫికెట్లు తయారు చేయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. తిరుపతితో పాటు అన్వేష్‌, సామ్రాట్‌, అగువతి ఈ దందా చేస్తున్నట్టు విచారణలో తేలింది. ఈ నలుగురు ఇప్పటి వరకు 24 నకిలీ ఇన్సురెన్స్ సర్టిఫికెట్స్ విక్రయించినట్టు  కాగజ్‌ నగర్ డీఎస్పీ హబీబ్‌ ఖాన్ తెలిపారు. వీరిని రిమాండ్ తరలించామన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com