ఆంధ్ర, తెలంగాణ లో రాష్ట్రాల్లో కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్
- July 17, 2017
తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు తొలి ఓటు వేశారు. ఆయన తర్వాత స్పీకర్ కోడెల శివప్రసాద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస రావు, పరిటాల సునీతో పాటు ఎమ్మెల్యేలు బాలకృష్ణ, పల్లె రఘునాథ రెడ్డి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. ఎన్డీఏ అభ్యర్థి కోవింద్ ఎన్నిక కావడమని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత జగన్ తో కలిసి ప్రత్యేక బస్సులో అమరావతికి వెళ్లారు. జగన్ తర్వాత వరుసగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
ఇటు తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి ఓటు వేశారు. స్పీకర్ మధుసూదనాచారి ఆ తర్వాత ఓటుహక్కు వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు టీఆర్ఎస్ భవన్ నుంచి అసెంబ్లీకి ప్రత్యేక బస్సులో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సీఎల్పీ నేత జానారెడ్డితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క గీతారెడ్డి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామ్ నాథ్ కోవింద్ విజయం ఖాయమని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ పై భారీ ఆశలు పెట్టుకుంది. ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందేలా చూసిన మాజీ స్పీకర్ మీరా కుమార్ కు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆత్మప్రబోధానుసారం ఓటేస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







