భాగ్యనగరం లో భారీ వర్షం
- July 17, 2017
హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కారణంగా నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బేగంబజార్, సుల్తాన్ బజార్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డికపూల్, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌లో ఈ ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో ఎంజే మార్కెట్, బషీర్‌బాగ్ ప్రాంతాల్లో రోడ్లు చెరువును తలపిస్తున్నాయి.
దీంతో పాటు సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. మోండా మార్కెట్, పార్శీ గుట్ట, మధురానగర్, వారాసిగూడ, చిలకలగూడ, పద్మారావు నగర్, మారెడ్‌పల్లి, అడ్డగుట్ట, కార్ఖనా, బేగంపేట్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, జవహర్‌నగర్, బాలాజీనగర్, యప్రాల్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలైన వారాసిగూడ, మధురానగర్, న్యూ అశోక్‌నగర్ కాలనీల్లో రహదారులు నీటితో నిండాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









