సౌదీ అరేబియాలో ముసుగు ధరించని మహిళా శ్రామికులకు 1000 దిర్హమ్ ల జరిమానా

- October 19, 2015 , by Maagulf
సౌదీ అరేబియాలో  ముసుగు ధరించని మహిళా శ్రామికులకు 1000 దిర్హమ్ ల జరిమానా

సాంప్రదాయ గల్ఫ్ సామ్రాజ్యం లో ప్రవేశపెట్టబడిన నూతన కఠిన శ్రామిక చట్టాల ప్రకారం, సౌదీ అరేబియా లో తలపై ముసుగు లేకుండా పట్టుబడిన మహిళా శ్రామికులకు 1,000 సౌదీ రియాల్ ల (1,000 దిర్హ మ్ ) జరిమానా విధించబడుతుంది. అంతేకాకుండా, మహిళలకు ఉపాధి కల్పించిన సంస్థలు తమ తలపై ముసుగును ధరించాలని  లిఖితాపూర్వకంగా నిర్బంధించాలని, లేదంటే సంస్థపై 5,000 సౌదీ రియాల్ ( 5,000 దిర్హ మ్) జరిమానా విధించబడుతుందని శ్రామిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇంకా, రాత్రి వేళల్లో మహిళలతో పనిచేయిస్తే 5,000 సౌదీ రియాల్ ( 5,000 దిర్హ మ్) ; మహిళలు, పురుషులకు వేర్వేరు విభాగాలు కేటాయించని సంస్థలపై 10,000సౌదీ రియాల్ ల (10,000 దిర్హ మ్ ) లు జరిమానా ఉంటుందని వారు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com