10గంటలపాటు పూరీ జగన్నాధ్ విచారణ
- July 19, 2017
ఉదయం పదిన్నరకు నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయంలోకి వెళ్లిన దర్శకుడు పూరీని నలుగురు విచారణాధికారులు నిర్విరామంగా ఇంటరాగేట్ చేశారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో పూరీని బయటకు వదిలారు సిట్ అధికారులు. సుమారుగా పది గంటల పాటు విచారించారు. కాసేపట్లో మీడియాతో సిట్ అధికారులు మాట్లాడనున్నారు. జ్యోతిలక్ష్మి ఆడియో రిలీజ్ ఫంక్షన్లో కెల్విన్
ఉన్న ఫోటోలను పూరికి చూపించి సిట్ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. కెల్విన్ బ్యాంకు అకౌంట్‌కి డబ్బులు పంపినట్టు సిట్ ఆధారాలు చూపించడంతో ఈవెంట్ చేయించుకున్నందున డబ్బు ఇచ్చానని పూరి సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. కాగా, విచారణ సమయంలో బయట నుంచి ఎవరూ లోపలికి రాకుండా త్రీ- టైర్ భద్రతను ఏర్పాటుచేశారు. కనీసం సెల్ ఫోన్లను కూడా అనుమతించలేదు. డ్రగ్స్ వాడకం మీద, డ్రగ్స్ ముఠాలతో సంబంధాల మీద, ఇండస్ట్రీలో మిగతావారి అడిక్షన్ మీద.. రకరకాలుగా ప్రశ్నలేసి ఉక్కిరిబిక్కిరి చేసినట్లు తెలుస్తోంది.
కెల్విన్ కాల్‌డేటా, అతడు పంపిన ఎస్ఎంస్లు పూరీకి చూపిస్తూ కూపీ లాగినట్లు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్లు కూడా పూరీ క్వశ్చనింగ్ లో పాల్గొన్నట్లు చెబుతున్నారు. పూరీని బైటికి పంపిన తర్వాత అకున్‌సబర్వాల్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. సాయంత్రం ఆరు గంటల సమయంలో బ్లడ్ శాంపిల్స్ కిట్ తో ఉస్మానియా హాస్పిటల్ సర్జన్ సిట్ ఆఫీసులోకి వెళ్లినట్లు, పూరి బ్లడ్ శాంపిల్స్ తీసుకోనున్నట్లు, పూరి డ్రగ్స్ తీసుకున్నారా లేదా నిర్ధారించనున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్‌పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







