తొలిసారి భారత్ లో వరల్డ్ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు

- July 25, 2017 , by Maagulf
తొలిసారి భారత్ లో వరల్డ్ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు

భారత బాక్సింగ్‌లో ఓ చారిత్రాత్మక ఘట్టానికి తెరలేవనుంది. 2021లో నిర్వహించనున్న పురుషుల వరల్డ్ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు భారత్ వేదికగా జరగనున్నట్లు అంతర్జాతీయ బాక్సింగ్‌ సమాఖ్య(ఏఐబీఏ) ప్రకటించింది. 

ఈ పోటీలను ఎక్కడ నిర్వహించాలన్న దానిపై రెండు రోజులుగా మాస్కోలో ఏఐబీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ చర్చించింది. ఈ చర్చల అనంతరం భారత్‌లో నిర్వహిస్తున్నట్లు ఏఐబీఏ ప్రకటించింది. పురుషుల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌కి ఆతిథ్యం ఇవ్వడం భారత్‌కి ఇదే తొలిసారి.

2019లో సోచిలో పురుషుల ఛాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏఐబీఏ అధ్యక్షుడు చింగ్‌ కుయో వు తెలిపారు. ఆ తర్వాత 2021లో పురుషుల ఛాంపియన్‌షిప్‌ కూడా భారత్‌లోనే జరగనుంది. ఇక 2018లో మహిళల వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను భారత్‌ ఆతిథ్యమివ్వనుంది.
మహిళల వరల్డ్ ఛాంపియన్‌షిప్‌నకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. గతంలో 2006లో భారత్‌ వేదికగా ఈ పోటీలు జరిగాయి. ఆగస్టులో హాంబర్గ్‌లో జరగబోయే పురుషుల ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు చింగ్‌ కుయో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com