స్విమ్మింగ్ చేసుకుంటూ ఆఫీసుకి వెళ్తున్నాడు...

- July 25, 2017 , by Maagulf
స్విమ్మింగ్ చేసుకుంటూ ఆఫీసుకి వెళ్తున్నాడు...

జర్మనీకి చెందిన బెంజమిన్‌ డేవిడ్‌ అనే వ్యక్తి మ్యూనిచ్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతి రోజు ఆఫీసుకు వెళ్తూ గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కొని వెళ్ళాల్సిన పరిస్థితి దాపురించింది. దీనిని అధిగమించడానిక ఓ విన్నూత మార్గాని ఎంచుకున్నాడు బెంజమిన్. ఇప్పుడు అదే జర్మనీలో హాట్ టాపిక్‌. 

రోజూ ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు ట్రాఫిక్‌ ఎక్కువగా ఉంటోందని. బెంజమిన్ గంటల తరబడి ట్రాఫిక్‌లో ఉండలేక...మ్యూనిచ్‌లోని ఇసార్‌ నదిలో ఈదుకుంటూ ఆఫీస్‌కి వెళ్తున్నాడు. ఆఫీసు టైమ్‌కు చేరుకొనే విధంగా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు... వాటర్‌ప్రూఫ్‌ బ్యాగులో తన ల్యాప్‌టాప్‌, స్విమ్‌‌సూట్‌, షూస్‌ సర్దుకుని రోజూ రెండు కిలోమీటర్ల మేర ఇసార్ నదిలో స్విమ్మింగ్ చేసుకుంటూ ఆఫీసుకు రీచ్ అవుతున్నాడు. డేవిడ్‌ ను చూసిన వాళ్లంతా నవ్వుతున్నా అతను మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఈదుకుంటూనే ఆఫీసుకు వెళ్లుతున్నాడు. పైగ స్విమ్మింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిదని హితబోధ కూడా చేస్తున్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com