కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ
- July 25, 2017
ఢిల్లీ పర్యటనలో సిఎం కేసీఆర్ బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతోపాటు..పలు కీలక అంశాలపై కేంద్రం పెద్దల్ని కలుస్తున్నారు. అటు అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపైనా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని కేసీఆర్ ఆయనను కోరినట్లు సమాచారం. విభజన సమస్యలతో పాటు రాష్ట్రానికి చెందిన కీలకమైన అంశాలను ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ధి వెంకయ్యనాయుడితోపాటు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ, జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితోనూ కేసీఆర్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక సమస్యలపై వీరితో చర్చించనున్నారు.
అటు తెలంగాణలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని కేసీఆర్ అధికారులను కోరారు.థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన బీహెచ్‌ఇఎల్ ఈ విషయంలో మరింత వేగం పెంచాలని సీఎం అధికారులకు నిర్దేశించారు. ఎన్ని ఒత్తిడిలు వచ్చినా విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించలేదని, విద్యుత్ ఉత్పత్తి అంతా ప్రభుత్వ రంగం సంస్థల ద్వారానే జరగాలని సీఎం స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







