సెల్ఫ్‌ సర్వీస్‌ కియోస్క్‌ల ద్వారా డ్రైవర్‌ లైసెన్స్‌లు

- July 26, 2017 , by Maagulf
సెల్ఫ్‌ సర్వీస్‌ కియోస్క్‌ల ద్వారా డ్రైవర్‌ లైసెన్స్‌లు

కువైట్: పౌరులకు, వలసదారులకు మెరుగైన సేవలందించే క్రమంలో ఎలక్ట్రానిక్‌ డ్రైవింగ్‌ లైసెన్సుల్ని జారీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రానున్న కొన్ని వారాల్లోనే ఈ కొత్త విధానం అందుబాటులోకి వస్తుంది. 15 సెల్ఫ్‌ సర్వీస్‌ కియోస్క్‌ల ద్వారా డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీ విధానాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీతో కూడిన ఈ కియోస్క్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఈ విభాగంలో మరింత మెరుగైన సేవలు పౌరులు, వలసదారులకు అందే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com