భారత్ లో మహిళా ప్రయాణికులకు విస్తారా ఆఫర్
- July 27, 2017
దిల్లీకి చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్ మహిళా ప్రయాణికులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. విమానంలో ఒంటరిగా ప్రయాణించే మహిళలకు మధ్య సీట్లు కాకుండా విండో సీట్లు లేదా వరుసలో మొదటి సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. అంతేకాకుండా విమానం ఎక్కేముందు, దిగాక కూడా వారి అవసరాలను చూసుకోవాలని నిర్ణయించింది.
రోజులో 75 నుంచి 100 మంది మహిళా ప్రయాణికులు ఈ సేవలు వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. మహిళా ప్రయాణికులకు ఇలాంటి ఆఫర్ ప్రకటించిన తొలి ఎయిర్‌లైన్ సంస్థ విస్తారానే కావడం విశేషం. విమానం ల్యాండ్ అయ్యాక దిగేటప్పుడు మహిళలు ఇబ్బందులు ఎదుర్కోవడం గమనించామని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని విస్తారా చీఫ్ సంజీవ్ కపూర్ వెల్లడించారు.
‘విస్తారాలో ఒంటరిగా ప్రయాణించే మహిళలు ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి ఎయిర్పోర్ట్ ఆధారిత ట్యాక్సీలను బుక్ చేయించడంతో పాటు విమానం దిగాక వారి అనుమతి మేరకు దగ్గరుండి ట్యాక్సీ ఎక్కించే ఏర్పాట్లు మా సిబ్బందే దగ్గరుండి చూసుకుంటారు. ఇలాంటి చర్యలతో మహిళలు విస్తారా విమానాల్లో నిశ్చింతగా ప్రయాణించే వీలుంటుంది’ అని వెల్లడించారు సంజీవ్.
ఈ కొత్త సర్వీసులను అంతర్జాతీయంగానూ విస్తరింపజేసి విదేశీ మహిళలకు కూడా ఈ సదుపాయాలను కల్పించనుంది విస్తారా. అంతేకాకుండా విస్తారా విమానాల్లో బోయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో శిక్షణ తీసుకున్న పైలట్లనే ఎంపిక చేసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్‌లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









