పట్టాలెక్కనున్నహీరో కమల్‌హాసన్ మరో చిత్రం
- July 27, 2017
అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్ తన కొత్త చిత్రం గురించి ప్రకటించారు. ‘తలైవన్ ఇరుక్కిరాన్’ అనే చిత్రంలో నటించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కమల్ ప్రధాన పాత్రలో ‘శభాష్ నాయుడు’, ‘విశ్వరూపం 2’ తెరకెక్కుతున్నాయి. ఈ రెండు చిత్రాల విడుదల తర్వాత ఆయన కొత్త సినిమా షూటింగ్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని కమల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
నిజానికి కొన్ని ఏళ్ల ముందే కమల్ ఈ నూతన ప్రాజెక్టు గురించి ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ దాన్ని పట్టాలెక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. మల్లీస్టారర్‌గా దీన్ని రూపొందించనున్నారట. ఆర్థిక, రాజకీయ అంశాల నేపథ్యంలో ఈ కథ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇందులో కీలక పాత్రలో నటించనున్నారని 2015లో కమల్ చెప్పారు. సినిమా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే చిత్ర బృందం ప్రకటన వరకూ వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







