రష్యన్ మహిళ ఎక్కాల్సిన విమానం తప్పిపోతే, పోలీసులు లగ్జరీ హోటల్ లో బస ఏర్పాటు
- July 27, 2017
' మనమెక్కాల్సిన రైలు ...ఓ జీవితకాలం లేటని ' మన దేశంలో అయితే సరిపెట్టుకోవచ్చు...కానీ దుబాయిలో అలా కాదు... విమానాలు సరిగ్గా ఖచ్చితమైన సమయానికే ఎగిరివెళ్లిపోతుంటాయి. ఈ విషయం ఎరగని ఓ రష్యన్ మహిళ ఉరుకులు పరుగులతో ఎయిర్పోర్ట్ కు చేరుకొంది. కానీ ఆమె వెళ్లాల్సిన విమానం వెళ్లిపోవడంతో ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.లో ప్రయాణికులు వేచి ఉండే సీట్లలో కూర్చుని ఉంది. గంట గడిచింది.. రెండు గంటలు గడిచాయి.. ఆమె తీరును చూసిన విమానాశ్రయ పర్యవేక్షణ పోలీసులకు అనుమానం వచ్చింది. దగ్గరకు వెళ్లి ఆమెను ఆరా తీశారు. అంతే అప్పటిదాకా ఉబికి పట్టుకున్న దు:ఖాన్ని వాళ్ల వద్ద వెళ్లబోసుకుంది. తన పరిస్థితిని వారికి వివరించింది. చేతిలో ఉన్న డబ్బుతో టికెట్ కొనేశాననీ, అయితే విమానం మిస్ అవడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోయింది. కనీసం టిఫిన్ చేయడానికి కూడా డబ్బుల్లేవని విలపించింది. దీంతో ఆమె స్థితికి చలించిపోయిన షార్జాహ్ పోలీసు అధికారులు వెంటనే స్పందించారు. ఆమెకు దగ్గర్లోని ఓ లగ్జరీ హోటల్లో రూమ్ బుక్ చేశారు. మరుసటి రోజుకు రష్యా విమానానికి టికెట్స్ బుక్ చేశారు. అంతేకాకుండా ఆమెకు ఏ లోటు రాకుండా చూసుకున్నారు. పోలీసుల తీరుకు రష్యా మహిళ ముగ్ధురాలైపోయింది. తాను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాననీ, పోలీసులు మానవతా కోణంలో సైతం స్పందిస్తారని తాను అనుకోలేదని ఆనందం వ్యక్తం చేసింది. ఆ నేపధ్యం పంచుకుంటున్న సమయంలో తీసిన ఫోటో, వీడియోను షార్జాహ్ పోలీసులు తమ అధికారిక ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







