పట్టాలెక్కనున్నహీరో కమల్‌హాసన్‌ మరో చిత్రం

- July 27, 2017 , by Maagulf
పట్టాలెక్కనున్నహీరో కమల్‌హాసన్‌ మరో చిత్రం

అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ తన కొత్త చిత్రం గురించి ప్రకటించారు. ‘తలైవన్‌ ఇరుక్కిరాన్‌’ అనే చిత్రంలో నటించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కమల్‌ ప్రధాన పాత్రలో ‘శభాష్‌ నాయుడు’, ‘విశ్వరూపం 2’ తెరకెక్కుతున్నాయి. ఈ రెండు చిత్రాల విడుదల తర్వాత ఆయన కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని కమల్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
నిజానికి కొన్ని ఏళ్ల ముందే కమల్‌ ఈ నూతన ప్రాజెక్టు గురించి ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ దాన్ని పట్టాలెక్కించడానికి ప్రయత్నిస్తున్నారు. మల్లీస్టారర్‌గా దీన్ని రూపొందించనున్నారట. ఆర్థిక, రాజకీయ అంశాల నేపథ్యంలో ఈ కథ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల సమాచారం. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ ఇందులో కీలక పాత్రలో నటించనున్నారని 2015లో కమల్‌ చెప్పారు. సినిమా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే చిత్ర బృందం ప్రకటన వరకూ వేచి చూడాల్సిందే.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com