గోల్డ్, జ్యుయెలరీ షాప్‌లలో ఉల్లంఘనలు: పలువురికి జరీమానా, జైలు
- July 27, 2017
మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ (ఎంసిఐ), ఇటీవలి కాలంలో గోల్డ్ మియు జ్యుయెలరీ దుకాణాల్లో నిర్వహించిన తనిఖీల సందర్భంగా 128 ఉల్లంఘనల్ని గుర్తించినట్లు పేర్కొంది. ఉల్లంఘనులకు 2 ఏళ్ళ జైలు శిక్ష, అలాగే 400,000 సౌదీ రియాల్స్ జరీమానా విధించినట్లు పేర్కొంది. గత వారం మినిస్ట్రీ 2,67 తనిఖీల్ని గోల్డ్ మరియు జ్యుయెలరీ దుకాణాల్లో నిర్వహించింది. ఈ సందర్భంగా 128 ఉల్లంఘనల్ని గుర్తించారు. ఇన్వాయిస్ మరియు ప్రైస్ ట్యాగ్స్కి సంబంధించి 63 ఉల్లంఘనలు వీటిల్లో ఉన్నాయి. అమ్మకాల సందర్భంగా స్కేల్స్‌ని వినియోగించకపోవడం అనే ఉల్లంగనలు 17 నమోదయ్యాయి. లైసెన్స్ లేని ఉల్లంఘనలు 11 గుర్తించారు. అమ్మకానికి ఉంచిన గోల్డ్‌కి స్టాంపింగ్ లేని కారణంగా 2 ఉల్లంఘనలు గుర్తించారు. ఎలాంటి ఉల్లంఘనలపై అనుమానం కలిగినా వినియోగదారులు మినిస్ట్రీ కాల్ సెంటర్ 1900 ని సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సైబరాబాద్‌లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..









