హైదరాబాద్‌లో మాజీమంత్రి ముఖేశ్‌గౌడ్ కొడుకు విక్రమ్‌పై కాల్పులు
- July 27, 2017
హైదరాబాద్ సిటీలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. మాజీమంత్రి ముఖేశ్‌గౌడ్ కొడుకు విక్రమ్‌పై గుర్తు తెలియని దుండగులు జరిపారు. ఈ ఘటనలో విక్రం చెయి, కడుపులోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి ఇంటికొచ్చిన విక్రంగౌడ్, పూజ నిమిత్తం ఉదయాన్నే నిద్రలేచాడు. అదే సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండుగుడు కాల్పులు జరిపినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నమాట. నైట్ ఇంటికి వచ్చినప్పుడు విక్రమ్ ఎవరితోనే ఘర్షణ పడినట్టు తెలుస్తోంది. దీంతో వాళ్లే వచ్చి ఆయనపై కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇదిలావుండగా విక్రమ్ ఇంట్లో లైసెన్స్ లేని గన్‌ని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంఖ్య 73 శాతం తగ్గింది..!!
- ఖతార్‌లో జాతీయ ఫ్లూ టీకా క్యాంపెయిన్.. ఉచితంగా వ్యాక్సిన్..!!
- బహ్రెయిన్‌లో వెటర్నరీ నమూనాల ఎగుమతి సులభతరం..!!
- యూఏఈలో షాపింగ్ పై ఇంధన ధరల ప్రభావం..!!
- కువైట్‌లో 8 కార్మిక చట్ట ఉల్లంఘనలపై ఫిర్యాదు.. ఇక ఆన్లైన్లోనే..!!
- జెడ్డా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 4లో పాస్‌పోర్ట్ కౌంటర్ల తనిఖీలు..!!
- దుబాయ్ రాయల్ ఫామిలీకు సిరిసిల్ల చేనేత కళాకారుడి అరుదైన కానుక
- ఖతార్‌లో ఇంపౌండ్ వాహనాల ఆన్లైన్ వేలం..!!
- గల్ఫ్ దేశాల భద్రతపై జీసీసీ పోలీస్ చీఫ్‌ల కీలక సమావేశం..!!
- దుబాయ్ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ.. యూఏఈకి మకాం మార్చిన భారతీయ వ్యాపారి..!!







