ఎయిర్ కండీషనర్ నుంచి వెలువడిన మంటలలో తగలబడిన శవర్మ దుకాణం

- July 27, 2017 , by Maagulf
ఎయిర్ కండీషనర్ నుంచి వెలువడిన  మంటలలో తగలబడిన శవర్మ దుకాణం

చల్లని గాలులు ఇచ్చే ఉపకరణం... క్షణాలలో నిప్పులు కురిపించే ఆపాయ పరికరంగా మారింది..రెప్పపాటులో ఆ ప్రాంతాన్ని బూడిద కుప్పగా మార్చింది.తీవ్రమైన విద్యుత్ వత్తిడికి లోనైనా ఓ  ఎయిర్ కండీషనర్ గురువారం అడ్లియా ఒక శవర్మ దుకాణం మంటలలో చిక్కుకొని తగలబడేలా చేసింది. కానీ, ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని నివేదికలు వెల్లడి చేస్తున్నాయి.  అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ లో సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ ఆరు అగ్నిమాపక దళాలు ప్రమాద స్థలానికి చేరుకొని నిమిషాల వ్యవధిలోనే  విజయవంతంగా మంటలను ఆర్పివేసింది. అంతేకాక, మంటలలో కాలిపోతున్న శవర్మ షాప్  సమీపంలోని ఇతర దుకాణాలకు ఆ మంటలు వ్యాపించకుండా  అగ్నిమాపక దళాలు సమర్ధవంతంగా నిరోధించాయి. స్థానిక అల్ కాట్కోట్ రెస్టారెంట్ వద్ద ఉన్న  ఒసామా బిన్ జైవ్ అవెన్యూలో  ఈ అగ్ని ప్రమాదం జరిగింది, ఈ ప్రాంతాన్ని సాధారణంగా అడ్లియా  లోని "షవర్మా అల్లే" గా పిలువబడుతుంది. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి " మా గల్ఫ్ డాట్ కామ్ " తో  మాట్లాడుతూ, రెస్టారెంట్ "ఈ సంఘటన గురువారం ఉదయం  సుమారు 8 గంటల సమయంలో  జరిగిందని  అదృష్టవశాత్తు ఆ సమయంలో దుకాణంలో ఎవరూ లేరని వివరించారు. ఈ రెస్టారెంట్ లో పనిచేసే కార్మికుడు ఒకరు మాట్లాడుతూ, అగ్ని ప్రమాద సమయంలో మూసివేయబడిన రెస్టారెంట్ లోపల నుండి దట్టమైన పొగ వెలువడటంతో లోపల ఏదో తగలబడుతున్నట్లు భావించి అగ్నిమాపక  దళంకు తెలియచేశామని పేర్కొన్నారు. మేము సాధారణంగా ఎయిర్ కండిషనర్లు రాత్రిపూట సైతం ఆపకుండా ఉంచుతాం, ఎందుకంటె, అధిక వేడి వాతావరణం కారణంగా  నిల్వ చేయబడిన ఆహారం పాడైపోకుండా దాటవు. ఒక భారీ ఫ్రీజర్ మరియు ఒక పానీయాల రిఫ్రిజిరేటర్  పని చేస్తూ ఉంటాయి..వాటి నుంచి అగ్ని వెలువడి మొత్తం దుకాణాన్ని నాశనం చేశాయిని ఆ వ్యక్తి తెలిపాడు.ఈ అగ్ని ప్రమాదంలో 1,000 బహెరిన్ దినార్ల వరకు నష్టం వాటిల్లవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.   దుకాణాన్నిశుభ్రపరచి మరో  రెండు రోజుల్లో మళ్లీ తెరవవచ్చునని ఆయన చెప్పారు. తగలబడిన దుకాణం సమీపం లేదా రెస్టారెంట్ పైన అపార్ట్మెంట్లు ఉన్నాయని సకాలంలో మంటలను అదుపు చేయడంతో అక్కడకు అవి  వ్యాపించలేదు. ఎనిమిది నెలల క్రితం ఇదే  సమయంలో గ్యాస్ సిలిండర్ పేలిందని తెలిపారు.  మేము భద్రతా ప్రమాణాలను మరియు సూచనలను అన్నీ పాటిస్తూనే ఉన్నామని కానీ మా దురదృష్టం అగ్ని ప్రమాద రూపంలో ఈ విధంగా నష్టపర్చిందని దుకాణ యజమాని వాపోయాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com