విశాల్ కు బెదిరింపులు
- July 28, 2017
నడిగర సంఘం ప్రధాన కార్యదర్శి తమిళ నిర్మాతల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కోలీవుడ్ హీరో విశాల్ ఇప్పటికే ఆ పదవి విషయంలో చాలా వివాదాలు ఎదుర్కున్నారు. నడిగర్ సంఘంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని విశాల్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం విశాల్ ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే విశాల్ దూకుడు వల్ల ఆయనకు చాలామందే వ్యతిరేకులు అవుతున్నారు.
తాజాగా విశాల్ బెదిరింపులు వచ్చాయి. 'నడిగర్' సంఘ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విశాల్‌ను.. చేతులు, కాళ్లు నరికి చంపేస్తామంటూ వాట్సాప్‌లో బెదిరిస్తున్నట్లు నిర్మాతలు మణిమ్మరన్, మహమ్మద్ సాహిల్ చెన్నై సీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే దీనిపై ఇంకా విశాల్ స్పందించలేదు. ఇలాంటి బెదిరింపులు రావడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









