ఉత్తరకొరియా మరో దుస్సాహసానికి ఒడిగట్టింది
- July 28, 2017
తమ చర్యలతో అగ్రరాజ్యం అమెరికా సహా పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. ఇతర దేశాల హెచ్చరికలను పెడచెవిన పెట్టి.. తాజాగా మరో ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. శనివారం ఉదయం ఈ క్షిపణిని ప్రయోగించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. హ్వాసంగ్-14 పేరుతో ప్రయోగించిన ఈ ఖండాంతర క్షిపని 3,725 కిలోమీటర్ల ఎత్తులో 998 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్ జలాల్లో పడింది.
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దీన్ని ప్రయోగించారు. క్షిపణి ప్రయోగంపై ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ వున్ సంతృప్తిని వ్యక్తం చేసినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ప్రయోగం విజయవంతమైందని కిమ్ అన్నారు. క్షిపణిని అభివృద్ధి చేసిన నిపుణులపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ క్షిపణితో అమెరికా మొత్తం తమ గుప్పిట్లో ఉందని తెలిపారు. అమెరికాలోని ప్రముఖ నగరాలైన లాస్ ఏంజిల్స్, చికాగో లాంటి వాటిని కూడా ఈ క్షిపణితో నాశనం చేసే సామర్థ్యం తమకుందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
కాగా.. ఉ.కొరియా ఇలాంటి ఖండాంతర క్షిపణిని ప్రయోగించడం ఈ నెలలో ఇది రెండోసారి. జులై 4న తొలి ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. అది అమెరికాలోని అలస్కాను చేరే సామర్థ్యం గలదని ఆ సమయంలో ఉ.కొరియా పేర్కొంది. తాజాగా మరోసారి అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల క్షిపణిని పరీక్షించింది.
ఇది ప్రమాదకర చర్య: ట్రంప్
ఉ.కొరియా క్షిపణి ప్రయోగాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. పొరుగుదేశాల హెచ్చరికలను పట్టించుకోకుండా ఉ.కొరియా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ క్షిపణి ప్రయోగం ప్రమాదకర చర్య అని ట్రంప్ అన్నారు. అమెరికా ప్రజలను, భూభాగాలను రక్షించేందుకు అవసరమైన భద్రతాచర్యలు తప్పకుండా తీసుకుంటామని చెప్పారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







