పేపర్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం, 6 గురు అగ్నిమాపక దళ సిబ్బందికి గాయాలు
- July 29, 2017
అల్-అహ్మది గవర్నరేట్ పరిధిలో పేపర్ ఫ్యాక్టరీ మరియు గిడ్డంగి వద్ద శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ( కె ఎఫ్ ఎస్ డి ) అగ్నిమాపక యంత్రాంగం సంఘటనా స్ధలానికి చేరుకోని ఎగిసిపడుతున్నమంటలను నియంత్రణలో ఉంచారు. శుక్రవారం జారీ చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంటూ, ఐదు అగ్నిమాపక సేవ స్టేషన్ల నుండి అగ్నిమాపకదళ సిబ్బంది తమ నిర్విరామ సేవలను అందించారని కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ( కె ఎఫ్ ఎస్ డి ) తెలిపింది. సమీప భవనాలకు ఈ మంటలు వ్యాపించకుండా ఎగిసిపడుతున్న ఆ అగ్నిని అణచివేయడానికి సిబ్బంది ఎంతగానే శ్రమించింది. ఆ అగ్నిని నియంత్రిస్తున్న సమయంలో ఆరుగురు అగ్నిమాపకదళ సిబ్బంది గాయపడ్డారని తెలిపింది. పేపర్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలను వెల్లడి చేయటానికి ఒక దర్యాప్తుని ప్రారంభించారు. కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ( కె ఎఫ్ ఎస్ డి ) ప్రస్తుత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ మొహమ్మద్ అల్-మహమెద్ " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధి తో మాట్లాడుతూ 4000 చదరపు మీటర్ల భవనంలోని 2,500 చదరపు మీటర్ల ప్రాంతం అగ్ని ప్రమాదం వలన నష్టపోయినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత
- కువైట్‌లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్‌లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్‌లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







