ఆగ‌స్ట్ 25న‌ విడుదల కానున్న 'అర్జున్ రెడ్డి'

- July 29, 2017 , by Maagulf
ఆగ‌స్ట్ 25న‌ విడుదల కానున్న 'అర్జున్ రెడ్డి'

యంగ్ హీరో హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘అర్జున్ రెడ్డి’ . ఈ మూవీ ఆగ‌స్ట్ 25న విడుద‌ల‌కానుంది. ఫస్ట్ లుక్ పోస్టర్స్, ట్రైలర్లతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి..సినిమా బాగా వ‌చ్చింద‌నే టాక్ బ‌య‌ట‌కు రావ‌డంతో చిత్ర హక్కుల్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియాన్స్ సినిమాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ.5.5 కోట్లకు కొనుగోలు చేసింది. నూతన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ వంగ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో షాలిని హీరోయిన్. కళ్యాణ్, జియా శ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి, క‌మ‌ల్ కామ‌రాజు, సంజ‌య్ స్వ‌రూప్‌, సీనియ‌ర్ కాంచ‌నలు ఇత‌ర పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com