తిరుగుముఖం పడ్తున్న ఖతార్ లోని ఉద్యోగులు
- July 29, 2017
ఖతార్ లో ఏర్పడిన సంక్షోభ ప్రభావం తెలంగాణ కార్మికులపై పడుతోంది. పొట్ట చేతపట్టుకొని అక్కడికి వెళ్లిన కార్మికులు ఇంటి ముఖం పట్టాల్సి వస్తోంది. రెండు రోజుల వ్యవధిలో తెలంగాణకు చెందిన సుమారు ఆరు వందల మంది ఖతార్ నుంచి ఇళ్లకు తిరిగి వచ్చారు. ఇంకా, చాలామంది కార్మికులు కొద్ది రోజుల్లోనే ఇళ్లకు చేరుకునే అవకాశం ఉందని ఇటీవల ఖతార్ నుంచి తిరిగి వచ్చిన కార్మికులు చెబుతున్నారు.
తీవ్రవాదానికి ఊతమిస్తోందనే కారణంతో ఖతార్‌పై తోటి గల్ఫ్ దేశాలు ఆంక్షలను విధించి, సహాయ సహకారాలను నిలిపివేయటంతో అక్కడి ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా, ఖతార్ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో సంక్షోభం మరింత తీవ్రమైంది. ఆర్థికభారం పడటంతో కంపెనీలను నిర్వహించడం సాధ్యం కాదని యాజమాన్యాలు కార్మికులను పనుల నుంచి తొలగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు వీసా గడువు ముగిసిపోయినా రెన్యువల్ చేయకుండా ఇంటికి పంపిస్తున్నాయి.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







